రాష్ట్రమా? రావణ కాష్టమా..? చంద్రబాబు ట్వీట్ వైరల్
X
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వరుస దుర్ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఇది రాష్ట్రమా..? రావణ కాష్ఠమా?’ అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల, పదో తరగతి విద్యార్థి సజీవ దహనం, ఏలూరు యాసిడ్ దాడి ఘటన గురించి ప్రశ్నిస్తూ వీడియో రిలీజ్ చేశారు. నాలుగేళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా సీఎం జగన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈ ఘటనలు జరుగుతున్న క్రమంలో శాంతి భద్రతలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొంత బిడ్డ అని చెప్పుకుంటున్న జగన్.. దాడులు చేసిన సొంత పార్టీ నేతల్ని కాపాడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పల్లె నుంచి పట్నం వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అక్రమాలను ఎత్తి చూపే విధంగా ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.
ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..? #RashtramaaRavanaKaashtamaa#NalugellaNarakam pic.twitter.com/q1LAE2f6yT
— N Chandrababu Naidu (@ncbn) June 26, 2023