Breaking News: చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు..
X
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. నవంబర్ 1వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఇవాళ్టితో ఆయన రిమాండ్ గడువు ముగియగా.. అధికారులు బాబును వర్చువల్గా కోర్టుముందు ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక తన సెక్యూరిటీపై అనుమానాలున్నాయని న్యాయమూర్తికి బాబు తెలిపారు. భద్రతపై అనుమానాలుంటే లేఖ ద్వారా తనకు తెలపాలని జడ్జి సూచించారు.
మరోవైపు టీడీపీ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. చంద్రబాబు ఆరోగ్యం సరిగ్గా లేదని..రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపు అడ్వకేట్ లూథ్రా వాదించారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిందని.. సుప్రీంలో బెయిల్ పిటిషన్ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నప్పడు విచారణ చేయొద్దని హైకోర్టును ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది.