ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..
X
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇవాళ ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.
సెప్టెంబర్ 9న సీఐడీ బాబును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరుచగా ఇవాళ్టి వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇవాళ రిమాండ్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజే తీర్పు వెలువడనుంది. ఇవాళ ఉదయం 10.30కు నిర్ణయం వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు చెప్పింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ హైకోర్టు నిర్ణయం లేకపోతే పోలీసు కస్టడీపై తాను ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఇవాళ హైకోర్టుకు సంబంధించి విచారణకొచ్చే కేసుల జాబితాలో చంద్రబాబు పిటిషన్ లేనందున ఏసీబీ కోర్టు ఇవాళే తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.