Home > ఆంధ్రప్రదేశ్ > భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి కాదు.. చిరుతలను చంపడానికి వెళ్తున్నట్టుంది: చంద్రబాబు

భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి కాదు.. చిరుతలను చంపడానికి వెళ్తున్నట్టుంది: చంద్రబాబు

భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి కాదు.. చిరుతలను చంపడానికి వెళ్తున్నట్టుంది: చంద్రబాబు
X

అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానంపై సెటైర్లు వేశారు. అమలాపురం గడియారం స్తంభంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. విమర్శలు గుప్పించారు. మనం ఆరాధ్య దైవంగా తిరుమలేశుని కొలుచుకుంటే.. చిరుత పులులను చంపమనడం ఏంటని ప్రశ్నించారు. చిరుతలను చంపడానికి భక్తులకు కర్రలు ఇస్తామంటున్నారని, ఇంటికో చేతికర్ర మాదిరి పాత రోజులు గుర్తొస్తున్నాయని వ్యాఖ్యానించారు. భక్తులు కర్రలు పట్టుకుని తిరుమల కొండెక్కుతుంటే.. దర్శనాకికి కాకుండా చిరుతలను చంపడానికి వెళ్తున్నట్టుందని విమర్శించారు. చేతిలో కర్రలు చూసి చిరుతలు పారిపోతాయా అంటూ ఎద్దేవా చేశారు.

సమర్థ ప్రభుత్వం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోదని.. వచ్చే ఎన్నికల్లో అదే కర్ర పట్టుకుని వైసీపీ దొంగలను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. రాఖీ గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 45 రోజులు పూజలు చేసిన రాఖీలను పంపిస్తున్నామని, ఆ మహా శక్తిని చేతికి కట్టుకొని తనను తలుచుకోండని ప్రజలకు సూచించారు. ఏ కష్టం వచ్చినా తనను ఊహించుకోవాలని, తమ కష్టాలను తీర్చే బాధ్యత భగవంతుడిదని అన్నారు. ఆ భగవంతుడి సంకల్పానికి ఆయన అండగా ఉంటానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Updated : 18 Aug 2023 2:43 PM GMT
Tags:    
Next Story
Share it
Top