Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: చంద్రబాబుకు డీహైడ్రేషన్.. జైల్లోనే

Chandrababu: చంద్రబాబుకు డీహైడ్రేషన్.. జైల్లోనే

Chandrababu: చంద్రబాబుకు డీహైడ్రేషన్.. జైల్లోనే
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. జైలులో తనకు చాలా ఇబ్బందులు ఉన్నాయని న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జైల్లో తీవ్ర ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్ బారిన పడినట్లు తెలుస్తుంది. గతకొద్దిరోజులుగా రాజమండ్రిలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. దీంతో అక్కడ తీవ్రమైన ఉక్కపోత నెలకొంది. దీంతో ఆయన వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ములాఖత్ లో ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఉంటున్న బ్లాక్ లో కనీసం ఫ్యాన్ కూడా లేకపోవడం గమనార్హం. దీనివల్లే తీవ్ర ఉక్కపోతకు గురై డీహైడ్రేషన్ కు లోనయ్యానని చంద్రబాబు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated : 10 Oct 2023 10:39 PM IST
Tags:    
Next Story
Share it
Top