చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్
X
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత బాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే సోమవారం జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబసభ్యులు కలిశారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ ద్వారా కలిశారు.
చంద్రబాబుతో ములాఖత్ అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ... ‘‘చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. తప్పులు చేసిన నాయకులే ఆయన్ను ఈ కేసులో ఇరికించారు. తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం వేధిస్తోంది. చంద్రబాబు జైలులో సంతోషంగా లేరు. పార్టీ కార్యకర్తల గురించి అడిగారు. వైకాపా ప్రభుత్వం వల్ల ప్రజలంతా కష్టాలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు గదిలో ఏసీ లేదు.. ఆయన్ను ఉంచిన గదిలో దోమలు ఉన్నాయి’’ అని అన్నారు.
అంతకుముందు రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
Chandrababu who is in Rajahmundry Jail was met by his wife Nara Bhuvaneshwari and Brahmani
Chandrababu , Rajahmundry Jail , wife Nara Bhuvaneshwari , daughter-in-law Brahmani, mulakat