Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా

చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా

చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా
X

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ బేలా, ఎం త్రివేది ఆధ్వర్యంలోని ధర్మాసనం వాదోపదాలను ఆలకించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నాది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

హోలీ సెలవుల తర్వాత పిటిషన్ పై విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. మరోవైపు చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్‌పై టీడీపీ సోషల్‌ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టిందని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కంప్లైంట్‌పై స్పందించిన సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు.ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అసభ్యకర పోస్టులను 24 గంటల్లోగా తొలిగించాలని సీఈవో మీనా ఆదేశించారు.

Updated : 19 March 2024 8:20 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top