చంద్రబాబు లక్కీ నంబర్ 23.. ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్
X
సంచలనాలకు మారు పేరు ఆర్జీవీ. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాదు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై ట్విట్టర్ వార్ చేస్తుంటారాయన. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆర్జీవీ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. చంద్రబాబుకు 23 నెంబర్ తో విడదీయరాని బంధం ఉందని, అది ఆయన లక్కీ నెంబర్ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు జరిగిన తేదీల ఆధారంగా బాబుకు 23వ నెంబర్ ఎంతో బాగా కలిసొచ్చిందో అంటూ ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఇంతకీ ఆర్జీవీ ఏమన్నారంటే?
1.వైసీపీ నుంచి చంద్రబాబు లాక్కున్న MLAలు 23 మంది
2.2019 ఎన్నికల ఫలితాల వల్ల తాను ఓడిపోయాను అని బాబు తెలుసుకున్న తేదీ 23
3.చంద్రబాబు గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు 23
4.బాబు అరెస్టైన తేదీ 9-9-23.. వీటిని కలిపితే వచ్చే నెంబర్ 23
5.స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023లో సెప్టెంబర్ 23 వరకు సీబీఐ కోర్టు జ్యూడీషియల్ రిమాండ్
6.బాబు ప్రిజన్ నెంబర్ .. 7691. వీటిని కలిపితే వచ్చే నెంబర్ 23
7.చంద్రబాబు కుమారుడు లోకేశ్ పుట్టిన తేదీ 23
8.వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్ 23
9.వ్యూహం సినిమా రిలీజ్ 23
అంటూ ఆర్జీవీ 23 నెంబర్ థియరీ చెప్పారు. ఇక ఆర్జీవీ పెట్టిన ఈ ట్వీట్ కు వైసీపీ అభిమానులు ఫిదా అవుతున్నారు. సార్ మీది మామూలు బ్రెయిన్ కాదు.. సూపర్ చెప్పారంటూ ఆర్జీవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.