Home > ఆంధ్రప్రదేశ్ > కౌంట్ డౌన్ స్టార్ట్..చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా రెడీ

కౌంట్ డౌన్ స్టార్ట్..చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా రెడీ

కౌంట్ డౌన్ స్టార్ట్..చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా రెడీ
X

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో శ్రీహరికోటవైపు చూస్తోంది. ఇస్రో బాహుబలి చంద్రయాన్-3 ప్రయోగానికి గురువారం మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ షార్‎కు చేరుకున్నారు. . శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగ సన్నాహాల్లో ఆయన నిమగ్నమయ్యారు. చంద్రయాన్-3 లాంచ్ రిహార్సల్‎ను బుధవారం పూర్తి చేసినట్లు ట్విటర్ వేదికగా తాజాగా ట్వీట్ కూడా చేశారు.

ఇవాళ మధ్యాహ్నం ఈ రాకెట్ లాంచింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్ డౌన్‎ను అధికారులు స్టార్ట్ చేస్తారు. అలా 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోట నుంచి నింగిలోకి చంద్రయాన్-3 దూసుకెళ్లనుంది. చంద్రుడిపై అడుగులు వేయనుంది. భూమికి సుమారు 3.84లక్షల కి.మీ.ల దూరంలో ఉన్న చంద్రుడి వరకు మూడు స్టేజుల్లో ఈ ప్రయోగం కొనసాగనుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రయోగాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా షార్‎లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10వేల మందికిపైగా ఈ ప్రయోగాన్ని వీక్షించనున్నట్లు తెలుస్తోంది. వీరికోసమే షార్‎లో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు.



Updated : 13 July 2023 4:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top