Home > ఆంధ్రప్రదేశ్ > CM Jagan : పలు నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు.. వైసీపీ నాలుగో జాబితా విడుదల

CM Jagan : పలు నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు.. వైసీపీ నాలుగో జాబితా విడుదల

CM Jagan : పలు నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు.. వైసీపీ నాలుగో జాబితా విడుదల
X

వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఒక ఎంపీ, 8 మంది ఇన్‌ఛార్జిలను ప్రకటించింది. తాజాగా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. శింగనమల, నందికొట్కూరు, తిరువూరు, మడకసిర, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచేయి చూపించింది. శింగనమల (ఎస్సీ రిజర్వడ్) సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. శింగనమల అసెంబ్లీ సమన్వయ కర్తగా ఎం.వీరాంజనేయులను నియమించింది. గంగాధర నెల్లూరు (ఎస్సీ రిజర్వడ్) సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం జి.నారాయణ స్వామికి స్థానచలనం కలిగిస్తూ..చిత్తూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. చిత్తూరు సిట్టింగ్ ఎంపీ ఎన్. రెడ్డప్పను జీ.డి. నెల్లూరు అసెంబ్లీ ఇంచార్జిగా నియమించారు. హోం మంత్రి తానేటి వనితను కొవ్వూరు (ఎస్సీ) నుంచి గోపాలపురం (ఎస్సీ) స్థానానికి బదిలీ చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు ఇన్‌చార్జిగా వైసీపీ అధిష్టానం నియమించింది. రీజినల్‌ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు వీరే..

జీడీ నెల్లూరు (ఎస్సీ) - ఎన్‌. రెడ్డప్ప

శింగనమల (ఎస్సీ) - ఎం. వీరాంజనేయులు

తిరువూరు (ఎస్సీ) - నల్లగట్ల స్వామిదాసు

కొవ్వూరు (ఎస్సీ) - తలారి వెంకట్రావు

నందికొట్కూరు (ఎస్సీ) - సుధీర్‌ దార

మడకశిర (ఎస్సీ) - ఈర లక్కప్ప

కనిగిరి - దద్దాల నారాయణయాదవ్‌

గోపాలపురం (ఎస్సీ) - తానేటి వనిత (హోం మంత్రి)

చిత్తూరు పార్లమెంట్‌ (ఎస్సీ) - కె. నారాయణస్వామి




Updated : 19 Jan 2024 9:04 AM IST
Tags:    
Next Story
Share it
Top