తిరుమల: అర్థరాత్రి వేళ బోనులో చిక్కిన చిరుత..
X
తిరుమలలొ చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతను ఎట్టకేలకు చిక్కింది. చిరుతను పట్టుకొనేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తిరుమల అటవీ శాఖ అధికారులు ఆ క్రూర మృగాన్ని బంధించారు. లక్షితను పులి బలి తీసుకోవటంతో వెంటనే అధికారులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో తిరుమలలో పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేసారు. బాలికపైన దాడి జరిగిన ప్రాంతంలోనే అర్ద్రరాత్రి ఆ బోనులో పులి చిక్కింది. ఇది పెద్ద చిరుత అనీ, దీని వయసు 5 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది పెద్ద చిరుత కాబట్టే.. చిన్నారిని చంపేసి ఉంటుందనీ.. అదే నెల కిందట మరో చిన్నారిపై దాడి చేసిన చిరుత వయస్సు ఏడాదిన్నర మాత్రమే.. అనీ , అందువల్లే అది ఆ చిన్నారిని చంపకుండా వదిలేసిందని అంటున్నారు.
ఇదే సమయంలో అలిపిరి నుండి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో రాత్రి చిరుతల సంచారం కనిపించింది. దీంతో అయిదు పులలు తిరుమల అడవుల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కారణంగా భక్తులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను టీటీడీ ప్రకటించింది. తిరుమలకు నడక మార్గంలో అయిదు పులుల సంచారం గుర్తించటంతో వెంటనే నిర్ణయాల అమలు ప్రారంభించింది. 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడకన మార్గాల్లో ప్రవేశం పై ఆంక్షలు విధించింది. నడక మార్గంలో భక్తుల సంఖ్య తగ్గించటం పైనా కసరత్తు చేస్తోంది. దర్శన టికెట్ల కోటా పెంపు ద్వారా నడక మార్గంలో రద్దీ తగ్గింపు సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. నడక దారిలో వచ్చే భక్తులకు దర్శనం టికెట్ల కారణంగా పెద్ద సంఖ్యలో నడక మార్గంలో వస్తున్నారని.. తిరుమలలో శీఘ్ర దర్శన టికెట్ల కోటా పెంచటం ద్వారా నడక దారి మార్గంలో మొక్కులు ఉన్న వారనే వస్తారని, దీని ద్వారా రద్దీ నియంత్రణ చేయవచ్చనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇస్తున్న 15 వేల శ్రీఘ్ర దర్శనం టికెట్ల కోటాను 30 వేలకు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిరుతపులుల అంశం, భక్తుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చించేందుకు ఇవాళ తిరుమలలో హైలెవెల్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారనీ, శాశ్వత ప్రాతిపదికన భక్తుల రక్షణకు నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఆల్రెడీ కాలినడక మార్గాల్లో ప్రస్తుతం కొత్త రూల్స్ అమలు చేశారు. 100 మంది భక్తులను ఒక గ్రూపుగా ఉంచి.. వారిని సెక్యూరిటీతో కొండపైకి పంపిస్తున్నారు. అలాగే పిల్లలను తల్లిదండ్రులు వదలకుండా చర్యలు తీసుకుంటున్నారు.