Home > ఆంధ్రప్రదేశ్ > చికెన్ లవర్స్‎కు షాక్..కేజీ ధర ఎంతో తెలుసా?

చికెన్ లవర్స్‎కు షాక్..కేజీ ధర ఎంతో తెలుసా?

చికెన్ లవర్స్‎కు షాక్..కేజీ ధర ఎంతో తెలుసా?
X

చికెన్ ధర మాంసం ప్రియులకు షాక్ ఇస్తోంది. ఒక్కసారిగా కోడి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. మొన్నటి వరకు రూ.250 పలికిన కిలో కోడి మాంసం ధర ఇఫ్పుడు 310 కి చేరింది. వీకెండ్‎లో ధర పెరగడంతో సామాన్యులు సండే మెనూ మార్చే పనిలో మునిగిపోయారు.

ఎండలు ముదురడంతో కోళ్లు చనిపోవడం, సరఫరా మార్కెట్‎కు తగ్గట్లుగా లేకపోవడంతో పాటు దాణా ఖర్చులు అధికమవ్వడంతో కోడి ధర కొండెక్కి కూర్చుకుంది. గత రెండు రోజులుగా మృగశిర కార్తె హడావిడి ఉండటంతో డిమాండ్‎కు తగ్గ సరఫరా లేకపోవడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‎లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.310 పలుకుతోంది. స్కిన్‎తో ఉన్న చెకెన్‎ను రూ.280 వరకు విక్రయిస్తున్నారు. ఇక లైవ్‌ బర్డ్‌ కిలో రూ.188 వరకు పలుకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే రూ.60లకు పైగా ధర పెరిగింది. పెరిగిన ధర వచ్చే వారం వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Updated : 10 Jun 2023 6:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top