Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ ఆఫీసులో దొంగలుపడ్డారు .. ఐదుగురి అరెస్ట్

జగన్ ఆఫీసులో దొంగలుపడ్డారు .. ఐదుగురి అరెస్ట్

జగన్ ఆఫీసులో దొంగలుపడ్డారు .. ఐదుగురి అరెస్ట్
X

ఏపీ సీఎం ఆఫీసులో డిజిటల్ సంతకాల దుర్వినియోగంలో నిందితులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఐదుగురు సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. సీఎంవో కార్యదర్శి ముత్యాల రాజు, ధనుంజయ్‌రెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న వ్యక్తులే ఈ మోసానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ - ఆఫీస్ ద్వారా సీఎంవోకి వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థనలను కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్లను అప్రూవ్ చేసినట్లు గుర్తించామన్నారు.





నిందితులు ఒక్కో ఫైల్‌కు రూ.30వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారని హర్షవర్ధన్ తెలిపారు. గత నెలల్లో 66 సీఎంపీలు విడుదల చేశారన్న ఆయన.. మొత్తం రూ.15 లక్షల వరకూ నిందితులు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. కాగా సీఎం కార్యాలయంలోని అధికారుల అధికారిక లాగిన్‌ వివరాలను తెలుసుకుని తమకు కావాల్సిన ఫైళ్లకు డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారా అప్రూవల్‌ ఇచ్చేసినట్లుగా ఇటీవలె వెలుగులోకి వచ్చింది.





ఈ అంశం సీఎంవో మఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి దృష్టికి రాగా.. సీఎంపీల ఫోర్జరీ, ఉన్నతాధికారుల లాగిన్‌ వివరాల దుర్వినియోగంలో తన పేషీలోని అటెండర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పాత్ర ఉన్నట్లు ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో కేసును సీఐడీకి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణ కొనసాగుతోందని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు.


Updated : 12 Aug 2023 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top