స్కాంలో ఎంత నొక్కేశారో లోకేశ్కు తెలుసు: సీఐడీ చీఫ్ సంజయ్
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు సంచలనం సృష్టించింది. నిందితునిగా మాజీ సీఎం చంద్రబాబు పేరును చేర్చారు. ఏసీబీ కోర్టుకు ఇచ్చిన 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో నారా లోకేశ్ పేరును ప్రస్తావించారు. రిపోర్ట్ లో లోకేశ్ పేరు చేర్చుతూ.. స్కాంలో ప్రధాన సూత్రదారునిగా ఆరోపణలు మోపారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏసీబీ కోర్ట్ లో కొనసాగుతుంది. స్కిల్ కేసులో మొత్తం రూ.371 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయని, అందులో ప్రమేయం ఉన్న వాళ్లందరికీ శిక్ష పడుతుందని అన్నారు. సంజయ్ చెప్పిన అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారని, అప్పటి అధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
స్కిల్ ప్రోగ్రామ్ విషయంలో ప్రభుత్వ రిలీజ్ చేసిన జీవోకు, అగ్రిమెంట్ కు చాలా తేడా ఉందని, తప్పుడు డాక్యుమెంట్లతో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని ఎక్కడా చెప్పలేదని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని కూడా ప్రస్తావించలేదని అన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఫ్రీగా సీమెన్స్ రూ.3300 ఇస్తుందని, ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందని చెప్పారు. కానీ రాష్ట్ర ఖజానా నుంచి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కు చెల్లించారని సంజయ్ తెలిపారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో లోకేశ్ పేరు ఉండగా.. తాజా సీఐడీ చీఫ్ సంజయ్ కామెంట్స్ బట్టి లోకేశ్ ను విచారణకు పిలుస్తారని, ఆయనను కూడా రిమాండ్ అని చెప్పి జైల్లో పెడతారని అంటున్నారు. అయితే చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్.. ఎక్కడైనా బాబు సంతకాలు ఉన్నాయా? ప్రూఫ్ లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు ఉంటే సీఐడీ అధికారులు చూపించాలని డిమాండ్ చేశారు. దాంతో ఇవాళ మీడియాతో మాట్లాడిన సంజయ్.. చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు చేశారు, ఎప్పుడు పెట్టారన్న విషయాలు మీడియాకు చూపించారు.