Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : చంద్రబాబుపై కేసు.. ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు

Chandrababu : చంద్రబాబుపై కేసు.. ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు

Chandrababu : చంద్రబాబుపై కేసు.. ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడేకొద్ది రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావు పేర్లను చేర్చారు. కాగా ఏపీ పైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ 2021లో కేసు నమోదు చేసింది. ఆ టైంలో చంద్రబాబు పేరును ఈ కేసులో 25వ నిందితుడిగా చేర్చారు. ఈ ప్రాజెక్ట్ పేరుమీద రూ.114 కోట్లు దుర్వినియోగం చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే తర్వాత జరిగిన విచారణ తర్వాత చంద్రబాబును ఏ1గా చేర్చింది.

కాగా కొన్నిరోజుల క్రితమే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణను పేర్కొంటూ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆపై రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న బాబు.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ తో విడుదలయ్యారు. అనంతరం ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై వరుస కేసులు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.




Updated : 17 Feb 2024 7:50 AM IST
Tags:    
Next Story
Share it
Top