Home > ఆంధ్రప్రదేశ్ > నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు.. ఆ రోజున విచారణకు రావాలని..

నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు.. ఆ రోజున విచారణకు రావాలని..

నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు.. ఆ రోజున విచారణకు రావాలని..
X

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని 41ఏ ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చారు. లోకేశ్‌ ప్రస్తుతం ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్‌ ఆఫీసులో ఉన్నారు. దీంతో సీఐడీ అధికారులు ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేశ్‌కు నోటీసులు అందజేశారు.





అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ -1గా, నారాయణను ఏ-2గా పేర్కొన్న సీఐడీ, నారా లోకేశ్‌ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో చేసిన మార్పుల ద్వారా లోకేశ్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని సీఐడీ ఆరోపించింది.

ఈ కేసులో కోర్టులో లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన రూల్స్ పాటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ లేకపోవడంతో ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

Updated : 30 Sept 2023 5:52 PM IST
Tags:    
Next Story
Share it
Top