చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. 5రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్పై కాసేపట్లో న్యాయస్థానం విచారణ జరపనుంది. మరోవైపు చంద్రబాబు లాయర్లు కోర్టులో హౌస్ రిమాండ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విననుంది.
హౌస్ రిమాండ్ పిటిషన్పై గట్టి వాదనలు వినిపిస్తామని చంద్రబాబు అడ్వకేట్ లూథ్రా తెలిపారు. 2021లో పశ్చిమబెంగాల్‌లో ఒకే కేసులో ఐదుగురు మంత్రులకు కోర్టు రిమాండ్ విధించిందని... అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హౌస్ రిమాండ్ విధించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అదే తరహా హౌస్ రిమాండ్ వర్తించేలా కోర్టును కోరతామన్నారు. హౌస్ రిమాండ్ పిటిషన్ తర్వాత హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని లూథ్రా చెప్పారు..