Home > ఆంధ్రప్రదేశ్ > ఇవాళ, రేపు చంద్రబాబు విచారణ.. సీఐడీకి కోర్టు ఏం చెప్పిందంటే..! .

ఇవాళ, రేపు చంద్రబాబు విచారణ.. సీఐడీకి కోర్టు ఏం చెప్పిందంటే..! .

ఇవాళ, రేపు చంద్రబాబు విచారణ.. సీఐడీకి కోర్టు ఏం చెప్పిందంటే..! .
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ విచారించనుంది. ఇవాళ, రేపు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జైల్లోనే ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు బాబును విచారించనున్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ జరగనుంది. ఈ క్రమంలో కోర్టు సీఐడీకి కీలక సూచనలు చేసింది.

చంద్రబాబుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించొద్దని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గంటకోసారి 5 నిమిషాల బ్రేక్ ఇచ్చి.. తన అడ్వకేట్ను కలిసేందుకు అవకాశమివ్వాలని సూచించింది. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించారు. కస్టడీ గడువు ముగిశాక ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ విధానం ద్వారా చంద్రబాబును న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు.


Updated : 23 Sept 2023 8:32 AM IST
Tags:    
Next Story
Share it
Top