Home > ఆంధ్రప్రదేశ్ > పాక్ హనీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం లీక్..?

పాక్ హనీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం లీక్..?

పాక్ హనీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం లీక్..?
X

పాక్ వలపు వలలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న కపిల్ కుమార్ పాక్ హనీట్రాప్లో చిక్కకున్నారు. ఉన్నతాధికారులతో అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతేడాది నుంచి అతడు విశాఖ స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్నారు.

అంతకుముందు కపిల్ కుమార్ భారత్ డైనమిక్స్లో పనిచేశారు. అక్కడ విధులు నిర్వహించేటప్పుడే వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రనాయకుడి పీఏ అయిన తమిషా అనే యువతి కపిల్ కుమార్కు సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. ఈ క్రమంలో ఇండియా వచ్చి అతడిని కలివడంతో పాటు కీలక సమాచారాన్ని రాబట్టింది. సుమారు రెండేళ్లపాటు ఈ వ్యవహారం కొనసాగినట్లు తెలుస్తోంది.

కపిల్ తీరుపై ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులో పలు కీలక విషయాలను కపిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయలేదని అతడు చెబుతుండగా.. అధికారులు మాత్రం నమ్మడం లేదు. అతడి మొబైల్స్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా కీలక సమాచారం పాక్ కు చేరి ఉంటుందని ఉన్నతాధికారులకు అనుమానిస్తున్నారు.


Updated : 7 Aug 2023 10:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top