Home > ఆంధ్రప్రదేశ్ > క్లీనర్ చేసిన పనికి 8 కోట్ల నష్టం..25ఏళ్ల కష్టం వృథా

క్లీనర్ చేసిన పనికి 8 కోట్ల నష్టం..25ఏళ్ల కష్టం వృథా

క్లీనర్ చేసిన పనికి 8 కోట్ల నష్టం..25ఏళ్ల కష్టం వృథా
X

ఓ క్లీనర్ చేసిన పని ఆ సంస్థకు ఊహించని నష్టాన్ని మిగిల్చింది. అతడు చేసిన పనికి 25 ఏళ్ల కష్టం వృథా అవడంతోపాటు 8 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటన 2020లో అమెరికాలో జరిగింది. అయితే క్లీనింగ్ సంస్థపై దావా వేయడంతో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని ట్రాయ్‌ ప్రాంతంలో రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ ల్యాబ్‌ ఉంది. ఇందులోని ఓ ఫ్రీజర్‌లో కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియకు సంబంధించిన నమూనాలను, ఇతర మూలకాలను మైనస్‌ 112 డిగ్రీల సెల్సియస్‌ వద్ద భద్రపరిచారు.





ఆ ఫ్రిజర్‌ నుంచి నిత్యం బీప్‌ శబ్దం వస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న క్లీనర్ విసుగెత్తిపోయాడు. ఈ క్రమంలో ఫ్రీజర్ స్వీచ్ ఆఫ్ చేశాడు. దీంతో లోపలున్న కూలింగ్‌ తగ్గిపోయింది. ఫలితంగా అందులో నిల్వచేసిన నమూనాలు దెబ్బతిన్నాయి. తమ పరిశోధకుల 25 ఏళ్లకుపైగా శ్రమ వృథా అయ్యిందని సంస్థ వాపోయింది. ఈ ఘటన దాదాపు మూడేళ్ల క్రితం చోటుచేసుకున్నా.. ఇటీవల ఆ క్లీనర్‌ను నియమించిన క్లీనింగ్ సర్వీస్‌పై పరిశోధన సంస్థ దావా వేసింది.

‘‘హెచ్చరికలు ఉన్నప్పటికీ.. కొంతమంది అనుచిత ప్రవర్తన, నిర్లక్ష్యం ఈ ఘటనకు కారణమైంది. ఫ్రీజర్ స్విచ్చాఫ్ చేయడంతో టెంపరేచర్ మైనస్ 112 డిగ్రీల సెల్సియస్ నుంచి 25.6 డిగ్రీలకు పడిపోయింది. దీని వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నాం. తమ పరిశోధకుల 25ఏళ్ల కష్టం వృథా అయ్యింది. మా కలలు కూలిపోయాయి.. పరిశోధన పునరావృతం చేయడానికి మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది’’ అని రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ వాపోయింది.




Updated : 27 Jun 2023 10:14 AM IST
Tags:    
Next Story
Share it
Top