Home > ఆంధ్రప్రదేశ్ > జనవరి 1 నుంచి పించన్లు పెంపు: సీఎం జగన్

జనవరి 1 నుంచి పించన్లు పెంపు: సీఎం జగన్

జనవరి 1 నుంచి పించన్లు పెంపు: సీఎం జగన్
X

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాష్ట్రంలో నాలుగు ప్రధాన కార్యక్రమాలు అమలు పరచబోతున్నమని, వాటిని విజయవంతంగా అమలు చేసేందుకు కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏపీ జిల్లాల్లోని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్.. వైఎస్సార్‌ పింఛను కానుక, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, అంబేడ్కర్‌ విగ్రహ ప్రరంభోత్సవాలపై చర్చించి వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి వైఎస్సార్ పించన్ కానుకను రూ. 3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. జనవరి 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ, జనవరి 23నుంచి 31 వరకు వైఎస్సార్ ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్సార్ చేయూత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



Updated : 28 Dec 2023 4:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top