Home > ఆంధ్రప్రదేశ్ > ఉద్యోగులకు జగనన్న కానుక.. విశాఖ నుంచి పాలనకు రెడీ

ఉద్యోగులకు జగనన్న కానుక.. విశాఖ నుంచి పాలనకు రెడీ

ఉద్యోగులకు జగనన్న కానుక.. విశాఖ నుంచి పాలనకు రెడీ
X

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 20) కేబీనెట్ మీటింగ్ జరిగింది. పలువురు ముఖ్య నేతలు, ప్రభుత్వ విప్ లతో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే విజయదశమి నుంచే విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభిస్తామని ప్రకటించారు. రేపటి నుంచి (సెప్టెంబర్ 21) అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పలు కీలక అంశాలపై కేబీనెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా విశాఖను రాజధానిగా ప్రస్తావిస్తూ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఈ దసరా నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని తెలిపారు. ఇంకా నెలకు పైనే సమయం ఉన్నందున అప్పటి వరకు కార్యాలయాలు తరలించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని అదేశించారు. కేబీనెట్ మీటింగ్ సందర్భంగా రాష్ట్రంలో ముందస్తు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామని జగన్ అన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు జగన్. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లును ఆమోదం తెలపడంతో పాటు.. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి ఇంటి స్థలం లేని వాళ్లకు ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. అంతేకాకుండా రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులు, వాళ్ల పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని, పిల్లల చదువుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవేకాక రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల చట్టంలో సవరణలపై బిల్లుకు కూడా కేబీనెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీల్లో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ, విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్, యూనివర్సిటీల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Updated : 20 Sep 2023 11:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top