Home > ఆంధ్రప్రదేశ్ > అమెరికా నుంచి తెలుగు విద్యార్థులను పంపేయడంపై జగన్ ఆరా

అమెరికా నుంచి తెలుగు విద్యార్థులను పంపేయడంపై జగన్ ఆరా

అమెరికా నుంచి తెలుగు విద్యార్థులను పంపేయడంపై జగన్ ఆరా
X

ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులకు షాక్ తగిలింది. సరైన పత్రాలు లేవని ఒకే రోజు 21 మంది భారతీయ విద్యార్థులు అమెరికా నుంచి బహిష్కరణ చేశారు. వారు ఏ ఎయిర్‌పోర్ట్‌లో దిగారో అక్కడి నుంచే తిరిగి మన దేశానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు పంపించేశారు. సరైన కారణం చెప్పకుండానే డీపోర్టేషన్‌ చేశారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీపోర్టేషన్‌ అయిన విద్యార్థులు చెప్తున్న సమాచారం ప్రకారం.. వాళ్లందరినీ ఇమిగ్రేషన్‌ చెకింగ్స్‌ తర్వాత ఇరుకు గదుల్లో పెట్టి ఎవరితో మాట్లాడకుండా నిర్బంధించేశారని వాపోతున్నారు. దీని ప్రకారం ఒకసారి డీపోర్టేషన్ చేస్తే 5 ఏళ్లపాటు యూఎస్‌లో అడుగుపెట్టే అవకాశం కోల్పోతారు. అయితే ఇలా బహిష్కరణకు గురైన వారిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్ధులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఈ ఘటనపై ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. వారి పూర్తి వివరాలతో పాటు సమాచారాన్ని సేకరించాలని..అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంలో అధికారులకు జగన్ సూచించారు.

Updated : 19 Aug 2023 7:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top