కిమ్ సోదరుడే జగన్ :చంద్రబాబు
X
ఏపీ నుంచి వైసీపీని తగిలివేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజలలో తిరుగుబాటు మొదలైందని చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జంగ్ సోదరుడిలా రాష్ట్రంలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పులివెందుల ప్రజలను భయపెట్టి జగన్ గెలుస్తున్నారని..కుప్పంలో మాత్రం తనను అభిమానంతో ప్రజలు గెలిపిస్తున్నారని స్పష్టం చేశారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడి పెట్టాల్సిన అవసరం తనపై ఉందని చంద్రబాబు తెలిపారు. అందరిలా భయపడి తాను రాష్ట్రాన్ని వదిలేస్తే..పూర్తిగా నాశనం అవుతుందని చెప్పారు.
రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీకే రక్షణ లేనప్పుడుు..సామాన్యుల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖలో జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వైజాగ్ లో నేటి పరిస్థితులకు ఒక ఉదాహరణ అన్నారు.హుద్ హుద్ ను సైతం తట్టుకున్న విశాఖ, నేడు అక్రమార్కులకు విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
2014 గెలుపు తర్వాత రాష్ట్ర అభివృద్ది ధ్యాసలో పడి పార్టీకి ప్రాధాన్యం ఇవ్వలేదన్న మాట వాస్తవమేనని..దాని వల్లే 2019లో నష్టపోయామని చెప్పారు. తెలుగుదేశం మరోసారి గెలిచి ఉంటే రాష్ట్రం ముందుకు దూసుకుపోయేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల స్థితిగతులు చూసి మహానాడులో మేనిఫెస్టో విడుదల చేశాం అన్న చంద్రబాబు..పేదలను ధనికులను చేయడం అనేది తన సంకల్పం అని వివరించారు. నేడు రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు.