Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు: సీఎం జగన్

ఏపీలో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు: సీఎం జగన్

ఏపీలో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు: సీఎం జగన్
X

దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏపీలో ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో మొత్తం 8 వేల ఎకరాల్లో ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. బుధవారం నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు తాడేప‌ల్లిలోని తన క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. అవుకు మండలంలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 2300 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ప్రాజెక్టు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎంగ్రీన్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 700 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, 300 మెగా వాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టు, బేతంచెర్ల మండలం ముద్దవరం, డోన్‌ మండల కేంద్రంలో ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 1000 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, 1000 మెగా వాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు మంజూరయ్యాయని సీఎం స్పష్టం చేశారు.

ఈ సోలార్ పవర్ ప్రాజెక్టులతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయని తెలిపారు. రూ.10వేల 350 కోట్ల పెట్టుబడితో రూపుదిందుకుంటున్న ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా 2300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వివరించారు.ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి ఇచ్చిన రైతులకు ప్రభుత్వం డబ్బులివ్వనుంది. ప్రతి ఎకరాకు లీజ్‌గా రూ.30 వేలు అందిస్తారు. ప్రతి రెండేళ్లకు ఒక శాతం ఎస్కలేషనల్ లో పెంచుతారు. నీళ్లకు ఇబ్బంది పడే రాయలసీమలో ఈ ప్రాజెక్టు రావడం..ఇలాంటి ప్రాంతంలో రైతులకు ఎకరాకు ప్రతి ఏటా రూ.30 వేలు లీజ్ ఇవ్వడం ఉపయోకరంగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.

Updated : 23 Aug 2023 10:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top