అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడు - సీఎం జగన్
X
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫైర్ అయ్యారు. మహానాడులో నాయకుల డ్రామా చూస్తుంటే ఆశ్చర్యం అనిపించిందని అన్నారు. వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తిని ఇప్పుడు యుగపురుషుడు, రాముడు, కృష్ణుడు అంటూ కీర్తిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో ప్రకటించి గెలిచిన తర్వాత ప్రజలను పొడవడం బాబు పొలిటికల్ ఫిలాసఫీ అంటూ ఫైర్ అయ్యారు.
ఎవరినైనా పొడుస్తాడు
వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరిని పొడిచేందుకైనా వెనుకాడరని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోను చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుందని అసలు మేనిఫెస్టో ఎలా రూపొందిస్తారో బాబుకు తెలుసా అని జగన్ ప్రశ్నించారు.
వైసీపీ మేనిఫెస్టో మట్టి నుంచి పుడితే బాబు మేనిఫెస్టో కర్నాటక నుంచి పుట్టిందని విమర్శించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్న ఏపీ సీఎం వైసీపీ హామీలు కాపీ కొట్టి.. పులిహోర వండారంటూ సటైర్ వేశారు.
టీడీపీకి అభ్యర్థులే లేరు
టీడీపీకి 175 సీట్లలో పోటీ చేసేందుకు క్యాండిడెట్లు కూడా లేరని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో ఏటా కరువు తాండవించేదని.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవని చెప్పారు. మహానేత వైఎస్సార్ జయంతి రోజున ఇస్క్యూరెన్స్ కూడా జమ చేస్తామంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు.
నగదు జమ
ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 2023–24 సీజన్‌కు సంబంధించి 52 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన 51 వేల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని అందజేశారు.
andhra pradesh,cm jagan,chandra babu,ntr,tdp manifesto,raithu bharosa,pm kisan,karnataka,వైస్సార్సీపీ
అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడు - సీఎం జగన్