Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో రూ.1425 కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ శంకుస్థాపన

ఏపీలో రూ.1425 కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ శంకుస్థాపన

ఏపీలో రూ.1425 కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ శంకుస్థాపన
X

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఏపీ సర్కార్ చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చడం మంచి పరిణామమని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం రూ.1425 కోట్ల పెట్టుబడులకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ"రూ.1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 3 జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు ద్వారా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

నెల్లూరులో క్రిబ్‌కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్‌ తయారీ ప్లాంట్‌ 12 నెలల్లోపే పూర్తవుతుందని జగన్ వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. అదే విధంగా నెల్లూరు జిలాల్లోనే విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్‌ వస్తోందని దీని ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు.

తిరుపతి జిల్లాలో రూ.400 కోట్ల పెట్టుబడితో కాంటినెంటిల్‌ కాఫీ ఫ్యాక్టరీ ఏర్పాటవతున్నట్లు జగన్ తెలియజేశారు. దీని ద్వారా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు.

ఏలూరు జిల్లాలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధరూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్థంతో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణ చేస్తున్నారని జగన్ తెలిపారు. అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం అని సీఎం పేర్కొన్నారు.ఈ యూనిట్‌ వల్ల కూడా మరో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు.. ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటానని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 22 Jun 2023 4:49 PM IST
Tags:    
Next Story
Share it
Top