ప్రైవేటు స్కూళ్లు.. మన సర్కారు స్కూళ్లతో పోటీ పడుతున్నాయి: సీఎం జగన్
X
వైఎస్ఆర్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్నారు. అప్పటివరకు పెత్తందారులకే అందుబాటులో ఉన్న చదువును పేద పిల్లల వద్దకు తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని పిల్లలను.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి తీసుకురావాలనే లక్ష్యంతో పని చేయాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగానే పదిరోజుల పండుగగా జగనన్న అమ్మ ఒడిని నిర్వహిస్తామని అన్నారు. బుధవారం (జూన్ 28) పార్వతీపురం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు. ఆ కారణంగానే పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నాం. భవిష్యత్తు తరాల కోసం విద్యపై పెట్టుబడి పెడుతున్నాం. ఆ కారణంగానే ఈరోజు 42,61,965 మంది తల్లుల అకౌంట్ లో రూ.6,392.94 కోట్లు జమ చేశాం. దీనివల్ల ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. వైఎస్సార్టీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రూ. 66,722.36 కోట్లను ఖర్చు చేసింది. నాడు - నేడు కార్యక్రమం ద్వారా స్కూల్లను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నాం. ప్రైవేటు స్కూళ్లను సర్కారు స్కూళ్లతో పోటీ పడేలా చేశా’మని సీఎం జగన్ అన్నారు.