Home > ఆంధ్రప్రదేశ్ > బాబు పులిహోర చేశాడు... టీడీపీ మేనిఫెస్టోపై స్పందించిన సీఎం జగన్

బాబు పులిహోర చేశాడు... టీడీపీ మేనిఫెస్టోపై స్పందించిన సీఎం జగన్

బాబు పులిహోర చేశాడు... టీడీపీ మేనిఫెస్టోపై స్పందించిన సీఎం జగన్
X

అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడరంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తిని ఇప్పుడు యుగపురుషుడు, రాముడు, కృష్ణుడు అంటూ కీర్తిస్తున్నారన్నారు. రాజమండ్రిలో మహానాడు పేరుతో డ్రామా చేశారన్నారు. మ్యానిఫెస్టోను చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుందని తెలిపారు. మట్టి నుంచి తమ మ్యానిఫెస్టో పుట్టిందని.. కర్ణాటక నుంచి బాబు మ్యానిఫెస్టో పుట్టిందంటూ విమర్శించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని పేర్కొన్నారు. 175 సీట్లలో పోటీ చేసేందుకు క్యాండెట్లు కూడా లేరంటూ ఎద్దెవా చేశారు.

గురువారం వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో బహిరంగ సభలో 52 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు తొలి విడతగా 5 వేల 500 చొప్పున పెట్టుబడి సాయం నిధులను జమ చేశారు. మిగిలిన రూ.2 వేలను పీఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో గురించి తొలిసారి స్పందించారు సీఎం జగన్. చంద్రబాబు మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్‌లో పుట్టలేదని, కర్ణాటకలో పుట్టిందని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను టీడీపీ కాపీ కొట్టిందని ఆరోపించారు. అంతేకాకుండా నవరత్న పథకాలైన రైతు భరోసా, అమ్మఒడితో పాటు వైఎస్సార్ పథకాలను కాపీ కొట్టారని అన్నారు. అందరి పథకాలను కాపీ కొట్టి పులిహోర తయారుచేశారని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

'చంద్రబాబుకు ఒరిజినాల్టీ, పర్సనాల్టీ, క్యారెక్టర్, క్రెడబులిటీ అంతకన్నా లేవు. మరో ఛాన్స్ ఇవ్వండి.. ఏదో చేసేస్తా అంటున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. సీఎంగా మొదటి సంతకానికి క్రెడిబులిటీ ఉంటుంది. కానీ గతంలో రుణమాఫీ అంటూ చంద్రబాబు మొదటి సంతకాన్నే మోసంగా మార్చేశారు' అని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే.. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారంటూ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవన్నారు. గత ప్రభుత్వ పాలనకు, మీ బిడ్డ పాలనకూ మధ్య తేడా చూడాలని.. మహానేత వైఎస్సార్‌ జయంతి రోజున ఇన్స్యూరెన్స్‌ కూడా జమ చేస్తామంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated : 1 Jun 2023 1:09 PM IST
Tags:    
Next Story
Share it
Top