Home > ఆంధ్రప్రదేశ్ > లాయర్ల ఖాతాల్లోకి డబ్బులు.. ఇవాళ బటన్ నొక్కనున్న సీఎం

లాయర్ల ఖాతాల్లోకి డబ్బులు.. ఇవాళ బటన్ నొక్కనున్న సీఎం

ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.25 వేలు

లాయర్ల ఖాతాల్లోకి డబ్బులు.. ఇవాళ బటన్ నొక్కనున్న సీఎం
X



ఏపీలోని జగన్ సర్కార్ నేడు మరో పథకానికి సంబంధించి నిదులు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ లాయర్లకు "వైఎస్సార్‌ లా నేస్తం" నిధులు విడుదల చేయనుంది. 2023–24 సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా ఈ పథకం కింద లాయర్ల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పునఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలలకు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి మొత్తం రూ.25 వేలను వేయనుంది. ఈ రోజు మొత్తం 2677 మంది లాయర్లకు 6,12,65,000 రూపాయలను వారి వారి అకౌంట్‌లలోకి జమ చేయనున్నారు.

కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది.

ఇక కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది. భార్యాభర్తలు ఉంటే.. ఒకరే అర్హులు అవుతారు. ఫోర్ వీల్ వైహికల్ ఉన్నా ఈ పథకం వర్తించదు. మూడేళ్ల ప్రాక్టీస్ దాటిన జూనియర్ లాయర్లు, ప్రాక్టీస్ చేయని లాయర్లు అర్హులు కాదు.




Updated : 26 Jun 2023 1:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top