సీఎం జగన్కు అస్వస్థత.. రెండు గంటలపాటు వైద్య పరీక్షలు
Mic Tv Desk | 21 Aug 2023 8:04 PM IST
X
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాలి మడమ నొప్పితో బాధపడుతున్న జగన్.. రెండు గంటలకు పైగా డయాగ్నస్టిక్ సెంటర్ లో ఉన్నారు. ఆయనకు పూర్తి పరీక్షలు జరిపిన వైద్యులు.. ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించి, తదుపరి మెడికల్ టెస్టులు చేశారని సమాచారం. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జగన్.. గతకొంత కాలంగా మడమ నొప్పితో బాధపడుతున్నారు. గతంలో కూడా జనరల్ చెకప్ చేయించుకున్నారు. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తున్న టైంలో కాలు బెణికింది. చికిత్స్ చేసిన వైద్యులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని సూచించారు. అయినా నొప్పి తగ్గక అప్పటినుంచి జగన్ సమస్య ఎదుర్కుంటున్నారు.
Updated : 21 Aug 2023 8:04 PM IST
Tags: cm Jagan ap news ap politics Vijayawada Tenet Lab CM Jagan is ill Moghalrajapuram Tenet Diagnostic Center
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire