వరద బాధితులకు ప్రభుత్వం అండ.. నదికి గోడ కడతామంటూ..
X
గోదావరి వరదల్లో ముంపుకు గురైన కోనసీమ గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించారు. కోనసీమ జిల్లా గురజాపులంకలో పరిస్థితులు పరిశీలించిన జగన్.. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు పెడతామని, పంట నష్టం పూర్తిగా పరిహారం అందిస్తామని తెలిపారు. నివాసం కోల్పోయిన ప్రజలకు తక్షణ సాయంగా ప్రతి గుడిసెకు రూ. 10వేల ఆర్థిక సాయం అంతిస్తామని ప్రకటించారు. మునుషులు ఉంటున్న లంక గ్యామాల్లో నదీ తీరానికి రివిట్మెంట్ లేకపోవడం వల్ల కోతకు గురవుతున్నాయన్నారు. అందుకు పరిష్కారంగా ముంపు ఎక్కడ గురవుతుందో అక్కడ గోడ కట్టాలని ఆదేశించారు.
అందులో భాగంగానే లంకల్లో దాదపు మూడున్నర కిలో మీటర్ల పొడవున నదికి రక్షణ గోడ కట్టడానికి తక్షణ సాయంగా రూ. 150 కోట్లు మంజూరు చేశారు. రివిట్మెంట్ వాల్ నిర్మాణానికి అంచనా రూపొందించి.. నెల రోజుల్లో టెండర్లు పిలిచి, రెండు నెలల్లో పనులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం తమదని తెలిపారు. గత ప్రభుత్వానికి.. తమ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని లంక గ్రామాలకు పిలుపునిచ్చారు. లంక గ్రామాలను పర్యటించి ఫొటోలకు ఫోజులిచ్చింది తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. అందరికీ మంచి జరగాలని, అందరి మంచిని కోరుకునే ప్రభుత్వం తమదని తెలియజేశారు.