Home > ఆంధ్రప్రదేశ్ > ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం జగన్ వార్నింగ్

ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం జగన్ వార్నింగ్

ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం జగన్ వార్నింగ్
X

గడప గడప కార్యక్రమంలో గ్రాఫ్ సరిగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరించారు. గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.





ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరును వెల్లడించారు. గడపగడపకు 18 మంది ఎమ్మెల్యేలు తిరగలేదని..వారిని పిలిచి మాట్లాడతానని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యేలు తిరగలేదన్నారు. అక్టోబర్‎లో తీరు మార్చుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికీ అయినా నియోజకవర్గంలో బాగా తిరగాలని చెప్పారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకం మని..175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.





జులై 1వ తేదీ నుంచి జరిగే జగనన్న సురక్ష కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు . క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి నేతలు వెళ్లాలని తెలిపారు. ఏయే పథకాలు అందలేదో తెలుసుకోవాలన్నారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం ఉంటుందని జగన్ వివరించారు.


Updated : 21 Jun 2023 11:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top