CM Jagan : వారికి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. రైతు రుణమాఫీకి సన్నాహాలు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ సర్కార్ అన్ని రకాలకు తమ ప్రణాళికలను రూపొందించుకుంది. జనవరి 31వ తేదిన సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశాన్ని నిర్వహించనుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి వైసీపీ సర్కార్ చర్చించనుంది. అదేవిధంగా ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం కొన్ని కొత్త పథకాలను కూడా అమలు చేయనుంది.
అసెంబ్లీ సమావేశాల్లో జగనన్న కాలనీలకు సంబంధించిన అంశాలపై వైసీపీ నేతలు చర్చించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికలకు ముందుగా ఏపీలోని రైతులకు రుణమాఫీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 31న కేబినెట్ భేటీలో రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై కేబినెట్‌లో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రైతులతో ముచ్చటించే కార్యక్రమాలను కూడా వైసీపీ నేతలు చేపట్టే అవకాశం కూడా ఉంది.
ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకుంటే రాష్ట్రంలోని ఓట్లన్నీ వైసీపీ సర్కార్‌కు పడతాయనే అంచనాతో వైసీపీ నేతలు ఉన్నారు. సీఎం జగన్ కూడా ఆ రకంగానే దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీకి గట్టి పోటీని ఇస్తోన్న టీడీపీ, జనసేన పార్టీలు కూడా రైతులతో పలు కార్యక్రమాలు చేపట్టి వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయనున్నాయి. వైసీపీ పాలనలో రైతులకు ఎదురైన సమస్యలను ఎత్తిచూపడమే ప్రధాన అజెండాగా టీడీపీ-జనసేన పార్టీలు రైతులకు వివరించనున్నాయి.