ఇవాళ ప్రధానితో జగన్ భేటీ.. కీలక మంతనాలు : CM Jagan
X
ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. టీడీపీ జనసేన పొత్తులో ఉండగా.. బీజేపీ వీరితో జతకడుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాలతో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయ పరిస్థితులు, పొత్తులపై బాబు వారితో చర్చించారు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖాయమనే చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధాని మోదీ సహా అమిత్ షాను కలవనున్నారు.
ఇవాళ ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు మోదీతో భేటీ అయి.. పలు కీలక అంశాలపై చర్చిస్తారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సాయం అందించాలని కోరనున్నారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన హామీలను నెరవేర్చాలని కోరనున్నారు. అయితే ఏపీ రాజకీయాలు, పొత్తుల అంశంపైనే ప్రధాని చర్చ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.