Home > ఆంధ్రప్రదేశ్ > Bapatla Siddham Sabha: బాపట్ల ‘సిద్ధం’ వేదికగా మేనిఫెస్టో ప్రకటించనున్న సీఎం జగన్‌

Bapatla Siddham Sabha: బాపట్ల ‘సిద్ధం’ వేదికగా మేనిఫెస్టో ప్రకటించనున్న సీఎం జగన్‌

Bapatla Siddham Sabha: బాపట్ల ‘సిద్ధం’ వేదికగా  మేనిఫెస్టో ప్రకటించనున్న సీఎం జగన్‌
X

ఈ నెల 10 న బాపట్ల జిల్లాలోని మేదరమీట్ల వద్ద నిర్వహించబోయే సిద్ధం మహసభలో వైసీపీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ పీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి. మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సిద్ధం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మెుదలవుతుందన్నారు. సభా వేదిక కేంద్రంగా రాష్ట్ర వైసీపీ క్యాడర్‌కు సీఎం జగన్ దిశ, దశను నిర్దేశిస్తారని ఆయన వెల్లడించారు. అధికారం చేపట్టిన అనంతరం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. రాబోయే కాలంలో ఏం చేస్తామనేది కూడా సీఎం వివరిస్తారని చెప్పారు. 'వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్‌సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది’ అని కామెంట్స్‌ చేశారు.

ఇప్పటి వరకు జరిగిన సిద్దం సభల స్పందనను చూస్తే వైసీపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందనారంలో ఎటువంటి అనుమానం లేదన్నారు. మా పాలన, సంక్షేమం చూసి బిసీలు వైసీపీ వైపు ఆకర్షితులయ్యారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే 175కు 175 సాదిస్తామనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేవన్నారు. సభ మొత్తం 100 ఎకరాల్లో 15 లక్షల మంది పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆరు పార్లమెంట్ స్థానాలు, జిల్లాల నుంచి ప్రజలు ఈ సభకు హాజరవుతారని విజయసాయిరెడ్డి తెలిపారు. సభలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.

Updated : 2 March 2024 3:09 PM IST
Tags:    
Next Story
Share it
Top