Home > ఆంధ్రప్రదేశ్ > CM Jagan : ఎన్నికల్లో శ్రీకృష్ణుడి పాత్ర మీది, అర్జునుడి పాత్ర నాది.. దేనికైనా 'సిద్ధం' అన్న జగన్

CM Jagan : ఎన్నికల్లో శ్రీకృష్ణుడి పాత్ర మీది, అర్జునుడి పాత్ర నాది.. దేనికైనా 'సిద్ధం' అన్న జగన్

CM Jagan : ఎన్నికల్లో శ్రీకృష్ణుడి పాత్ర మీది, అర్జునుడి పాత్ర నాది.. దేనికైనా సిద్ధం అన్న జగన్
X

మేదరమెట్లలో జన ప్రవాహం కనిపించిందని, మరో ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీచాలని సీఎం జగన్ అన్నారు. మేదరమెట్లలో నేడు సిద్ధం సభను నిర్వహించారు. సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..ఎన్నికల కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలదని, అర్జునుడి పాత్ర తనదని అన్నారు. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని, ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. బిందువు, బిందువు సింధువు అయినట్లుగా, తనపై నమ్మకంతో ఉప్పెనలా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

మరో ఐదేళ్లు తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని సీఎం జగన్ అన్నారు. ఇప్పటీకే ఉత్తారంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధంగా ఉందని, ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా వైసీపీని గెలిపించేందుకు సిద్ధమైందన్నారు. చంద్రబాబులా తనకు నటించే పొలిటికల్‌ స్టార్‌ క్యాంపెయినర్లు లేరని, అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా తనకు లేదన్నారు. పార్టీల పొత్తులతో బాబు, ప్రజలే బలంగా తాను తలపడుతున్నామన్నారు.

ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న తనకు ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రతి ఇంట్లోనూ ఉన్నారన్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని, మూడు పార్టీలతో ఉన్న చంద్రబాబు కూటమి మరోసారి మోసం చేయకుండా ప్రజలంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు మాదిరిగా తనకు నటించే పొలిటికల్‌ స్టార్లు లేరని, రకరకాల పార్టీలతో పొత్తులూ లేవని అన్నారు. జగన్‌ అంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, వైసీపీతో నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకున్నారన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలంతా గడపగడపకూ తిరుగుతున్నారని, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబంలో జరిగిన అభివృద్ధి చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. వైసీపీ పాలనలో ప్రతీ ఇంట్లోనూ చిరునవ్వు కనిపిస్తోందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో ఐదేళ్ల పాటు అభివృద్ధి వైపు దూసుకుపోదామని పిలుపునిచ్చారు. చంద్రబాబు చెప్పిన ఏడు హామీలకు ఏటా వేల కోట్లు ఖర్చవుతాయని, వాటిని అమలు చేసే సత్తా టీడీపీకి లేదన్నారు. ప్రజలంతా మరోసారి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.

Updated : 10 March 2024 5:53 PM IST
Tags:    
Next Story
Share it
Top