Home > ఆంధ్రప్రదేశ్ > CM Jagan : విద్యారంగంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం..సీఎం జగన్ కామెంట్స్

CM Jagan : విద్యారంగంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం..సీఎం జగన్ కామెంట్స్

CM Jagan : విద్యారంగంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం..సీఎం జగన్ కామెంట్స్
X

విద్యాదీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. కృష్ణ జిల్లా పామర్రు సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. 9,44,666 మంది విద్యార్థులకు రూ. 708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరుకు ఈ పథకం కింద రూ.12,609 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా ఎక్కువ మంది చదువుకునేలా ప్రమాణాలను పెంచామని అన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించండి.. 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఇస్తున్నామని చెప్పారు. మీ ఫీజులు మీరే కట్టుకోండి అని గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలికామని, పిల్లలు ఇబ్బందులు పడకూడదని త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు చెల్లిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.జగన్ పక్కకు పోతే జరిగే నష్టం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని జగన్ పిలుపునిచ్చారు.

పిల్లల చదువులు ఉండవు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు. ఆరోగ్యంశ్రీ పథకం అమలు కాదని సీఎం అన్నారు.మనల్ని విమర్శిస్తున్న వాళ్ల పిల్లలు ఏ‌ మీడియంలో చదువుతున్నారో మీరే అడగాలి. వాళ్ల పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. పేదవారు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు జాతి అంతరించిపోతుందని అంటున్నారు. వాళ్ల పిల్లల చేతిలో టాబ్ లు ఉండొచ్చు.. మన పిల్లల చేతిలో టాబ్ లు ఉంటే ఏవేవో చూస్తూ చెడిపోతున్నారని యాగీ చేస్తున్నారు. పెత్తందారీ నిదర్శనాలు మన ముందే‌ కనిపిస్తున్నాయి. విద్యా రంగంలో వారికి మనకి యుద్ధం జరుగుతుంది. పెత్తం దారులకు, పేదలకు మధ్య జరుగుతుంది క్లాస్ వార్. మీ అన్నగా మీ తరుపున విద్యా రంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తెచ్చాం. ఈ విప్లవమే అడుగులు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగా మిగిలిపోతారు. పిల్లలు బాగుపడాలనే ఈ తిరుగుబాటు చేస్తున్నామని జగన్ అన్నారు.

Updated : 1 March 2024 8:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top