Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ సభలో వింత ఘటన.. టిఫిన్ ప్యాకెట్ల కోసం పోలీసులు ఎగబడ్డరు

జగన్ సభలో వింత ఘటన.. టిఫిన్ ప్యాకెట్ల కోసం పోలీసులు ఎగబడ్డరు

జగన్ సభలో వింత ఘటన.. టిఫిన్ ప్యాకెట్ల కోసం పోలీసులు ఎగబడ్డరు
X

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు దినోత్సవ కార్యక్రమం కోసం సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు చేసిన చర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బందోబస్తులో ఉన్నవాళ్లకు పంపిణీ చేసే ఆహారం కోసం.. పోలీసులు ఎగబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు సెక్యూరిటీ కోసం ఉదయం 3 గంటలకు మైదానానికి రాగా.. ఉదయం 10 గంటలైనా ఎవరూ టిఫిన్స్ అందించలేదు. సమీపంలోని టిఫిన్ సెంటర్స్, దుకాణాలు కూడా మూసి ఉండడంతో.. అవస్థలు పడ్డారు. దీర్ఘకాలిక జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవాళ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆకలికి అలమటించిన పోలీసులు.. ఆహారం పంపిణీ అనగానే ఎగబడిపోయారు. టిఫిన్ పొట్లాల కోసం తోసుకున్నారు. అయినా, కొంతమందికే టిఫిన్ ప్యాకెట్లు అందడంతో మిగిలిన వాళ్లు నిరాశగా మళ్లీ ఎదురు చూశారు.







Updated : 8 July 2023 2:54 PM IST
Tags:    
Next Story
Share it
Top