Home > ఆంధ్రప్రదేశ్ > Jagan Mohan Reddy : విశాఖ నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా సీఎం జగన్

Jagan Mohan Reddy : విశాఖ నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా సీఎం జగన్

Jagan Mohan Reddy  : విశాఖ నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా సీఎం జగన్
X

అసెంబ్లీ ఎన్నికల తర్వాత విశాఖలో ఉంటాన్నని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సారి కూడా తమదే విజయమని మళ్లీ గెలిచి వైజాగ్ నుంచి ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన వెల్లడించారు. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికి శాసన రాజధానిగా కొనసాగుతోందని జగన్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయామని, అందుకే విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి ఎంతో అవసరం అని సీఎం

వెల్లడించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేదు. కేంద్రం సహకారం ఉండాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలి. సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ నగరం మారుతుంది. అమరావతికి నేను వ్యతిరేకం కాదు. శాసన రాజధానిగా అది కొనసాగుతుంది. అక్కడ 50వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదు.

అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని చెప్పారు సీఎం జగన్. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ధి చెందదన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ….ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వెల్లడించారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్. కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి…స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని ఫైర్‌ అయ్యారు. భవిష్యత్ తరాల కోసమే మేం పనిచేస్తున్నామన్నారు సీఎం.హైదరాబాద్ కంటే విశాఖ అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని బెంగుళూరు కన్నా విశాఖలోనే మేరుగైన సదుపాయలు ఉన్నాయని తెలిపారు. కోందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, విపక్షానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కోర్టు కేసులతో విపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.




Updated : 5 March 2024 9:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top