Home > ఆంధ్రప్రదేశ్ > మీ పనికో దండం సామీ.. చేసేవన్నీ సగం సగం పనులే..!

మీ పనికో దండం సామీ.. చేసేవన్నీ సగం సగం పనులే..!

మీ పనికో దండం సామీ.. చేసేవన్నీ సగం సగం పనులే..!
X

కాంట్రాక్టర్లు, అధికారుల పనితీరు సామాన్య ప్రజలను ఎప్పుడూ.. ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచూస్తుంటుంది. నాన్యత లేని పనులు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి ఓ ఘటనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగింది. గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మత్తులు, పాడైన పాత రోడ్లపై మళ్లీ కొత్తరోడ్లు వేసే పనికి శ్రీకారం చుట్టారు. వర్షాకాలం వస్తుండటంతో మట్టి, గుంతలు పడ్డ రోడ్లకు స్వస్థి చెప్పొచ్చని భావించిన నగరవాసులకు అవాక్కయ్యారు. మీ పనికో దండం సామీ.. అంటున్నారు. ఎందుకంటే..

మరమ్మత్తులు ప్రారంభించిన అధికారులు.. రోడ్ల పక్కన, ఇళ్లముందు పార్నింగ్ లో ఉన్న వాహనాల కింద రోడ్డు వేయకుండా వెళ్లిపాయారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ‘రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టారు. వాటిని మేమెందుకు జరిపి రోడ్లు వేయాలి. మా పని ఏదో అదే చేసుకుంటూ వెళ్లిపోయాం’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసే పనుల్లో నాణ్యత తక్కువ.. మళ్లీ అందులో నిర్లక్ష్యం, సగం సగం పనులు ఏంటని కాంట్రాక్టర్ పై మండి పడుతున్నారు.

Updated : 28 Jun 2023 10:23 PM IST
Tags:    
Next Story
Share it
Top