Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు లాయర్ ‘కత్తి’ వ్యాఖ్యలపై దుమారం...

చంద్రబాబు లాయర్ ‘కత్తి’ వ్యాఖ్యలపై దుమారం...

చంద్రబాబు లాయర్ ‘కత్తి’ వ్యాఖ్యలపై దుమారం...
X

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తరఫున కోర్టులో వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది. పోరాడాలంటే కత్తి కావాంటూ ఆయన చేసిన ట్వీట్ హింసను రెచ్చగొట్టేలా ఉందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బాబు అరెస్టును, కోర్టుల్లో వ్యతిరేకంగా వస్తున్న తీర్పులను జీర్ణించుకోలేకనే ఆయన కవ్వింపుకు పాల్పడతున్నారని మండిపడుతున్నారు.

‘‘అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేరలో కనిపించకపోతే కత్తి పట్టడమే సరైంది. పోరాటమే శరణ్యం’ ని లూథ్రా ట్వీట్ చేశారు. సిక్కుల పదో మతగురువు గురుగోవింద్‌ సింగ్‌ మొగల్ చక్రవర్తి ఔరంగజేబుకు రాసిన ‘జఫర్‌నామా’లోని ఆ వాక్యం ఉంది. ‘ఇన్‌ ద సర్వీస్‌ ఆఫ్‌ గురు గోవింద్‌జీ’ అనే ట్విటర్‌ ఖాతాలోని ఉన్న ఆ వాక్యాలను లూథ్రా ‘ఈ రోజు సూక్తి’ అని రీట్వీట్‌ చేశారు. చంద్రబాబు కేసు పరిణామాలు, రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో ఒక ప్రఖ్యాత లాయర్ ఇలా ట్వీట్ చేయడం సరికాదని కొందరు న్యాయవాదులు కూడా విమర్శిస్తున్నారు. కాగా లూధ్రా బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసి మంతనాలు జరిపారు. ఈ కేసులో బాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Updated : 14 Sept 2023 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top