చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగు దాడిలో దంపతుల మృతి
X
చిత్తూరు జిల్లాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. గుడిపాల మండలంలో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏనుగు దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు 190 రామాపురం దళితవాడకు చెందిన వెంకటేష్, సెల్విగా గుర్తించారు. తీవ్ర గాయాలైన వ్యక్తి బస్వా పల్లికి చెందిన కార్తీక్ గా గుర్తించారు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఓ ఆవు దూడ కూడా మృతిచెందింది. ఈ ఘటనతో సమీప గ్రామస్తులు భయాందోళనతో వణికిపోతున్నారు. మరోవైపు స్థానికులు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సరిగ్గా పది రోజుల క్రితం జిల్లా లోని పెద్దపంజాణి మండలంలో కూడా ఇలాంటి ఘటనే టుచేసుకుంది. ఏనుగు దాడిలో భార్యాభర్తలు గాయపడగా.. భర్త పరిస్థితి విషమించి చనిపోయాడు. ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మార్కొండయ్య(52)-అరుణమ్మ అనే దంపతులు ఎప్పటిలాగే పొలానికి వెళ్లి... సాయంత్రం ఇంటికెళుతుండగా.. మార్గమధ్యలో ఏనుగు దాడి చేసింది. ఈ క్రమంలో భర్త మార్కొండయ్య కిందపడిపోయాడు. దీంతో ఆ ఏనుగు ఆయనను కాలితో తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అరుణమ్మ ఆ ఏనుగు బారి నుంచి ఎలాగోలా తప్పించుకుంది