Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu arrest: చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్.. జడ్జి ఏమన్నారంటే?

Chandrababu arrest: చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్.. జడ్జి ఏమన్నారంటే?

Chandrababu arrest: చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్.. జడ్జి ఏమన్నారంటే?
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో శనివారం (సెప్టెంబర్ 9) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. మొదటి నుంచి ఈ కేసు కక్షసాధింపు చర్యగా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వివరాలు చెప్పకుండా చంద్రబాబును ఉన్నట్టుండి అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. మొదట రూపొందించిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబును ఏ-1గా చేర్చి.. తాజాగా కోర్టులో ప్రవేశపెట్టే టైంలో ఏ-37గా పేర్కొన్నారు. ఏ-1గా గంటా సుబ్బారావు పేరును చేర్చారు. నిధుల మళ్లింపుపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అబ్జెక్షన్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సీఐడీ తెలిపింది. కాగా ఈ విషయంలో ఏసీబీ కోర్టు సీఐడి ఎదురుప్రశ్న వేసింది. ఎఫ్ఐఆర్ లో బాబు పేరు ఎందుకు లేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎందుకు ఆలస్యం అయిందని ప్రశ్నించారు. ఈ కేసుకు సెక్షన్ 409 వర్తించదని, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని బాబు తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

కాగా సీఐడీ.. ఏసీబీ కోర్టుకు ఇచ్చిన రిపోర్ట్ నుంచి కీలక విషయాలు బయటపడుతున్నాయి. 2021 డిసెంబర్ 9 కంటే ముందు నేరం జరిగినట్లు సీఐడీ రిపోర్ట్ లో పేర్కొంది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని.. ఇందులో రూ.271 కోట్లను షెల్ కంపెనీలకు దారి మళ్లించినట్లు ఆరోపించింది. అంతేకాకుండా ఈ కేసులో కీలక నిందితులు మనోజ్ వాసుదేవ్, పెండ్యాల శ్రీనివాస్ కు సెప్టెంబర్ 5న నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. కాగా బాబును కాపాడేందుకు వాళ్లిద్దరు విదేశాలకు పారిపోయారని అన్నారు. ప్రస్తుతం ఇరు వైపు న్యాయవాదుల వాదనలు కోర్ట్ వింటుంది. దీనిపై మధ్యాహ్నంలోగా రిజల్ట్ రానుంది.

Updated : 10 Sep 2023 9:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top