Home > ఆంధ్రప్రదేశ్ > Ap Highcourt : ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులా?..ఆ రూల్‌పై స్టే

Ap Highcourt : ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులా?..ఆ రూల్‌పై స్టే

Ap Highcourt : ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులా?..ఆ రూల్‌పై స్టే
X

వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతిస్తున్నట్లు తెలిపింది. దానిపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ప్రకాశం జిల్లాకు చెందిన సురేశ్‌తో పాటు మరికొందరు ఈ విషయంపై పిటిషన్ వేశారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషన్లో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్‌పై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకున్న తర్వాతే స్టే ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే ఆ ఒక్క రూల్‌పై స్టే విధిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. టీచర్ పోస్టుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికోసం జగన్ సర్కార్ 6100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు కోర్టుకెక్కారు. విచారణ జరిపిన హైకోర్టు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించలేమని స్టే విధించింది.

Updated : 21 Feb 2024 1:25 PM IST
Tags:    
Next Story
Share it
Top