Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్పై ఉత్కంఠ.. ఇవాళ కీలక తీర్పులు

Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్పై ఉత్కంఠ.. ఇవాళ కీలక తీర్పులు

Chandrababu Naidu  : చంద్రబాబు బెయిల్పై ఉత్కంఠ.. ఇవాళ కీలక తీర్పులు
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు ఇవాళ కీలకం కానుంది. ఆయన దాఖలు చేసిన పలు పిటిషన్లపై ఏసీబీ కోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు ఈ రోజు తీర్పు వెలువరించనున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరపనుంది. ఇదే కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో పాటు మరోసారి పోలీసు కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం.. సోమవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై శుక్రవారమే ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి.

ఇదిలా ఉంటే హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిల్‌ కోసం చంద్రబాబు వేర్వేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం తీర్పులను రిజర్వు చేసింది. ఈ మూడు బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు.


Updated : 9 Oct 2023 3:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top