Home > ఆంధ్రప్రదేశ్ > వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై సీపీ కీలక ప్రకటన

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై సీపీ కీలక ప్రకటన

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై సీపీ కీలక ప్రకటన
X

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు నాని కారణంగా మంటలు చెలరేగి కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారకులుగా వాసుపల్లి నాని, అతని మామ అల్లిపిల్లి వెంకటేష్లుగా గుర్తించినట్లు సీపీ ప్రకటించారు. వారిద్దరూ మద్యం మత్తులో సిగరెట్ తాగి పక్క బోటులో పడేయడంతోనే అది బోటు ఇంజిన్పై పడి మంటలు చెలరేగాయని, నైలాన్ వలల వల్ల ప్రమాద తీవ్ర పెరిగిందని చెప్పారు.

ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా, 18 పాక్షికంగా కాలిపోయాయని సీపీ రవి శంకర్ చెప్పారు. నిందితుని పేరు కూడా నాని కావడంతో యూట్యూబర్ పేరు కూడా వాసుపల్లి నానినే కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నామని సీసీ స్పష్టంచేశారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం నిందితుడు అతడు కాదని తేలిందని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని శాఖల సహకారంతో చర్యలు చేపడుతున్నామని రవి శంకర్ ప్రకటించారు.

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటన వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అంతకుముందు యూట్యూబర్ నాని.. పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు.. కీలక నిందితులను అరెస్టు చేశారు.




Updated : 25 Nov 2023 9:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top