Home > ఆంధ్రప్రదేశ్ > YCPలోకి అంబటి రాయుడు.. ఎంపీ టికెట్ పక్కా?

YCPలోకి అంబటి రాయుడు.. ఎంపీ టికెట్ పక్కా?

YCPలోకి అంబటి రాయుడు.. ఎంపీ టికెట్ పక్కా?
X

క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. తన రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనున్నాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇదివరకే రాజకీయాల్లోకి వస్తానని హింట్ ఇచ్చిన రాయుడు.. ‘రెండో సైడ్ త్వరలోనే చూస్తార’ని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ దిశగా తన అడుగులు వేగవంతం చేశాడు. అందుకు గత నెల 11న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిసిన రాయుడు.. ఇవాళ జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు వెళ్లాడు. దీంతో రాష్ట్రం రాజకీయాల్లో రాయుడి పేరు చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో దాదాపు అరగంటపాటు జగన్ లో చర్చించిన రాయుడు తర్వాత.. తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రాయుడు వైసీపీలో చేరి.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీలు అవడంతో ఈ ప్రచారం నిజమనేందుకు బలం చేకూరుతుంది. అయితే, గుంటూరు నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ కావాలని రాయుడు.. జగన్ ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాపు వర్గానికి చెందిన అంబటి రాయుడు.. జనసేన పార్టీవైపు వెళ్తారని అంతా అనుకున్నారు. కాని, ఈ మధ్య కాలంలో ఆయన వైసీపీ వైపు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.

Updated : 8 Jun 2023 5:45 PM IST
Tags:    
Next Story
Share it
Top