Home > ఆంధ్రప్రదేశ్ > గుంటూరు జిల్లాలో అంబటి రాయుడు పర్యటన

గుంటూరు జిల్లాలో అంబటి రాయుడు పర్యటన

గుంటూరు జిల్లాలో అంబటి రాయుడు పర్యటన
X

క్రికెటర్ అంబటి రాయుడు కొత్త అవతారం ఎత్తాడు. మైదానంలో తన బ్యాటింగ్‌తో అలరించిన రాయుడు...ప్రస్తుతం ప్రజాసేవకు సిద్ధమయ్యాడు. గుంటూరు జిల్లాలోని పల్లె పల్లె తిరుగుతున్నాడు. విద్యార్థులు, స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే పనిలో పడ్డాడు. రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు నేపథ్యంలో రాయుడు పర్యటనపై ఆసక్తి నెలకొంది.

ఐపీఎల్ తర్వాత రాయుడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. సీఎస్కే గెలిచిన ట్రోఫీతో సీఎం జగన్మోహన్ రెడ్డిని కుటుంబసమేతంగా కలిశాడు. దీంతో వైసీపీలోకి రాయుడు చేరిక ఖాయమని అంతా భావించారు. కానీ అతడు మాత్రం ముందుగా ప్రజాక్షేత్రంలో తిరిగి వారి సమస్యలు తెలుసుకోవడమే ప్రధాన అజెండా అని చెప్పాడు. తర్వాత పొలిటికల్ ఎంట్రీపై ఆలోచిస్తానని వివరించాడు.





ఇక ముందుగా ప్రకటించిన విధంగా రాయుడు ప్రజలతో మమేకమవుతున్నాడు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో పర్యటించారు. తొలుత పునీత శౌరివారి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం స్థానిక శౌరివారి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కాసేపు హెచ్ఎంతో మాట్లాడి అక్కడి పరిస్థితులను రాయుడు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి జగనన్న గోరుముద్ద భోజనం తిన్నా రు.





అనంతరం మీడియాతో మాట్లాడాడు. జిల్లాలో ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు తిరగడం జరుగుతుందని చెప్పారు. ఏ ప్రాంతంలో ఏ పనులు, ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకోని వాటిని నెరవేర్చడం తన ముందున్న లక్ష్యం అన్నారు. త్వరలోనే భవిష్యత్ ప్రణాళిక చెబుతా అని అంబటి రాయుడు స్పష్టం చేశాడు.


Updated : 29 Jun 2023 3:56 PM IST
Tags:    
Next Story
Share it
Top