Home > ఆంధ్రప్రదేశ్ > Tirupati : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..సర్వ దర్శనానికి 8 గంటల సమయం

Tirupati : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..సర్వ దర్శనానికి 8 గంటల సమయం

Tirupati : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..సర్వ దర్శనానికి 8 గంటల సమయం
X

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారంతా సగటున 4గంటలుగా ఉన్న దర్శన సమయం తాజాగా 8 గంటలు పెరిగింది. వీకెండ్ కావడంతో రద్దీ ఎక్కువ ఉందని, వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయని అధికారులు తెలిపారు. కాగా శుక్రవారం ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు రావడం విశేషం. ఆదివారం కూడా భక్తులు ఎక్కువగానే వస్తారని టీటీడీ వర్గాలు అంచన వేశాయి. సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నాలుగు కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి.

ఏటీసీ వరకు క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 80,964 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,657 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ4.31 కోట్లు వచ్చింది. పవిత్రమైన ధనుర్మాసం ముగియడంతో సోమవారం ఉద‌యం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభ‌మైంది. గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజామున నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది.

Updated : 11 Feb 2024 7:43 AM IST
Tags:    
Next Story
Share it
Top